కొత్తగా కొన్న దుస్తుల  కలర్‌ పోతోందా..  ఇలా చేయండి చాలు..

దీని కోసం బకెట్ లేదా టబ్‌లో పది నుండి పన్నెండు లీటర్ల నీరు తీసుకోండి.

ఈ నీటిలో ఒక చిన్న పటిక, రెండు దోసిళ్ళ ఉప్పు కలపాలి. దీనికి చల్లని నీరు తీసుకోవాలి. ఈ నీటిలో దుస్తులు కనీసం రెండు గంటల పాటు నాననివ్వండి.

రెండు గంటల తర్వాత నీళ్లలోంచి దుస్తులను ఒక్కొక్కటిగా తీసి శుభ్రమైన నీటిలో నానబెట్టి ఉతకాలి. 

కొన్ని దుస్తులు ఆ సమయంలో రంగు వదిలివేయవచ్చు కానీ మళ్లీ ఉతికినప్పుడు మాత్రం రంగు వదలవు.

ఈ ప్రక్రియను చేసిన తర్వాత, బట్టలు కొంచెం గట్టిగా అంచే పెళుసుగా మారతాయి. 

దుస్తులు పెళుసుదనం పోయి మృదువుగా మారడానికి ఒక బకెట్‍లో వెనిగర్ వేసి, ఈ వెనిగర్ నీటిలోదుస్తులను నానబెట్టి వాటిని తీసి ఆరబెట్టాలి.