కొందరు అతిగా ఆలోచిస్తారు. నిత్యం ఏవో భయాలు, ఆందోళనలతో సతమతం అవుతారు. దీనికి పరిష్కారం ఏంటంటే..

అదుపులేని ఆలోచనలతో ఉక్కిరిబిక్కిరయ్యేవారు ముందుగా తమకు నచ్చిన వ్యాపకంపై దృష్టి మళ్లించాలి

మనసుకు దగ్గరైన వారితో ఆలోచనలను పంచుకున్నా కొంత వరకూ ఉపశమనం లభిస్తుంది

మెడిటేషన్‌ను అలవాటు చేసుకుంటే మనసుపై, భావోద్వేగాలపై నియంత్రణ పెరుగుతుంది

ప్రతికూల ఆలోచనలు, వ్యాఖ్యలు చేసే వారికి దూరంగా ఉంటే ఆలోచనలు అదుపు తప్పవు

మనసులో చెలరేగే ప్రతికూల ఆలోచనలకు అక్షర రూపం ఇస్తే ఉపశమనం కలుగుతుంది

అప్పుడప్పుడూ విహార యాత్రకు వెళ్లడం కూడా మనసును తేలిక పరుస్తుంది. 

చేస్తున్న పనిమీదే దృష్టి పెట్టేలా మైండ్‌ఫుల్‌నెస్‌‌ను ప్రాక్టీస్ చేస్తే కూడా మంచి ఫలితం ఉంటుంది.