ఈ రెండూ పాటిస్తే చుండ్రు సమస్య ఇట్టే వదులుతుంది..

మీరు చుండ్రు సమస్యతో బాధపడుతున్నారా.. ఈ రెండు వస్తువులను ఉపయోగిస్తే డేండ్రఫ్ నుంచి వెంటనే ఉపశమనం లభిస్తుంది.

పెరుగులో లాక్టిక్ ఆమ్లం ఎక్కువ. పుల్లని పెరుగుకు చుండ్రును తగ్గించే లక్షణాలుంటాయి. దీన్ని ఇలా వాడితే వెంటనే చుండ్రు సమస్య మటుమాయం అయిపోతుంది.

ముందుగా మీరు పుల్లటి పెరుగును తలకు అప్లై చేసి కొద్దిసేపు అలాగే ఉంచండి. గంట తర్వాత తలస్నానం చేయండి. కొద్ది వారాలు ఇలాగే చేస్తే ఫలితం కనిపిస్తుంది.

వేపలో యాంటీ ఫంగల్, యాంటీ బాక్టీరియల్ లక్షణాలు ఉంటాయి. ఇవి చుండ్రును తొలగించడంలో సహాయపడతాయి.

వేప నూనెను జుట్టుకు రాసుకుని తలపై బాగా మసాజ్ చేయండి. గంట తర్వాత తలను శుభ్రం చేసుకోండి.

వారానికి రెండుసార్లు ఇలా వేపనూనెతో మసాజ్ చేస్తే చేదు దెబ్బకు డేండ్రఫ్ సమస్య పారిపోవడం ఖాయం.

ఈ రెండు పదార్థాలను ప్యాచ్ టెస్ట్ తర్వాత మాత్రమే వాడండి. లేకుంటే అలెర్జీ వచ్చే అవకాశం ఉంది