కండలు తిరిగిన దేహం కావాలా..  అయితే ఈ ఫుడ్స్ మీ డైట్‌లో  ఉండాల్సిందే!

సాల్మన్ చేపల్లో ఒమేగా-3, ఫ్యాటీ యాసిడ్స్‌తో పాటూ ప్రొటీన్లు ఎక్కువ ఉండడం వల్ల కండరాలకు మేలు చేస్తాయి.

చికెన్ బ్రెస్ట్‌లో అనేక ప్రొటీన్లు ఉండడం వల్ల కండరాల పెరుగుదలకు దోహదం చేస్తుంది.

గ్రీక్ యోగర్ట్ పెరుగులోని కాల్షియం, ప్రొటీన్లు.. కండరాలకు ఎంతో మేలు చేస్తాయి.

క్వినోవాలో జింక్, మెగ్నీషియం, ఐరన్ ఉండడం వల్ల కండరాల బలానికి దోహదం చేస్తాయి.

రోజూ గుడ్లు తీసుకోవడం వల్ల కూడా కండరాలు పెరిగేందుకు అవకాశం ఉంటుంది.

జిమ్‌లో వర్కవుట్ చేసే సమయంలో తీపి బంగాళాదుంపలు తీసుకోవడం వల్ల అవసరమైన శక్తి అందుతుంది.

బాదంలోని ప్రొటీన్లు కూడా కండరాల పెరుగుదలకు ఎంతో సాయపడతాయి.