కళ్ల కింద నలుపు తగ్గాలంటే..
రాత్రి పడుకునేముందు రెండు చెంచాల ఆలివ్ నూనెని కొద్దిగా వేడి చేసి కళ్ల చుట్టూ రాయాలి. వేళ్లతో సున్నితంగా మర్దన చేయాలి.
ఉదయాన్నే గోరువెచ్చని
నీటితో శుభ్రం చేసుకోవాలి.
ఇలా వారానికి రెండుసార్లు చేస్తే కళ్ల చుట్టూ రక్త ప్రసరణ మెరుగై నలుపుదనం తగ్గుతుంది.
ఒక చెంచా శనగపిండిలో రెండు చెంచాల వెనిగర్ వేసి బాగా కలపాలి.
ఈ మిశ్రమాన్ని కళ్ల కింద రాసి పది నిమిషాలు ఆరిన తరవాత మంచి నీళ్లతో శుభ్రం చేసుకోవాలి.
ఇలా రెండు రోజులకోసారి చేస్తే నల్లని వలయాలు తొలగిపోతాయి.
కలబంద గుజ్జును తీసుకుని చల్లని నీళ్లలో ముంచి దానిని కళ్ల చుట్టూ పట్టించాలి.
పదిహేను నిమిషాల తరవాత మంచినీళ్లతో శుభ్రం చేసుకోవాలి.
ఇలా వారం రోజులు చేస్తే ఫలితం కనిపిస్తుంది.
Related Web Stories
జపనీస్ ఫిట్నెస్ సీక్రెట్స్ ఏంటో తెలుసా?
ఆత్మవిశ్వాసం పెంచుకునే మార్గాలు ఇవే!
టేస్టీ టేస్టీ బొమ్మిడాయిల పులుసు.. ఇలా చేశారంటే అదుర్స్!
2025 పద్మ పురస్కారాలకు ఎంపికైన అభ్యర్థులు ఎవరో తెలుసుకుందాం