అరటికాయ ఆమ్లెట్ ఎప్పుడైనా తిన్నారా?  రుచి చూశారంటే అస్సలు వదిలిపెట్టరు

కావలసిన పదార్థాలు ; కోడిగుడ్లు, అరటి కాయ, మిరియాల పొడి, ధనియాల పొడి, గరం మసాలా, పచ్చిమిర్చి, అల్లం తురుము, క్యాప్సికమ్ ముక్కలు, నూనె కావాల్సినంత, ఉప్పు తగినంత

పచ్చి అరటికాయను తీసుకుని మీడియం సైజు ముక్కలుగా కట్ చేసుకుని మిక్సీలో వేసి మెత్తటి పేస్ట్‌లా చేసుకోవాలి.

అరటి మిశ్రమం తీసుకుని అందులో కోడిగుడ్లు పగలకట్టి పచ్చసొన, తెల్లసొన కలిసే వరకు బాగా కలుపుకోవాలి.

ధనియాల పొడి, గరం మసాలా, మిరియాల పొడి, కారం పొడి వేసి బాగా కలుపుకోవాలి.

ఇవన్నీ బాగా కలిసేలా కలుపుకుని కాసేపు పక్కనపెట్టుకోండి.

ఒక ఆమ్లెట్ ప్యాన్ తీసుకుని నూనె వేసి వేడి చేయండి.

నూనె వేడి అయ్యాక కోడిగుడ్డు మిశ్రమం వేసి రెండు వైపులా కాల్చుకోండి. రంగుమారేవరకు కాల్చుకోవడం మంచిది.

  రుచికరమైన అరటి కాయ ఆమ్లెట్ రెడీ