పసుపు రంగు దంతాలు..  ఇలా చేస్తే తెల్లగా మారతాయి.. 

విటమిన్-సి లోపం వల్ల దంతాల రంగు మారుతుంది. విటమిన్-సి ఉండే ఫలాలు తీసుకోవడం వల్ల దంతాల రంగును తెల్లగా మార్చుకోవచ్చు.

యాపిల్ సైడర్ వెనిగర్ కూడా దంతాలపై మరకలను తొలగించగలదు. 

మార్కెట్లో దొరికే కొన్ని ప్రత్యేకమైన టూత్ పేస్ట్‌లు కూడా మీ దంతాలను తెల్లగా మారుస్తాయి. 

 అల్లం ముక్కలను గ్రైండ్ చేసి, దానికి ఉప్పు, నిమ్మరసం కలిపి ఆ మిశ్రమాన్ని టూత్ బ్రష్‌తో దంతాలపై రుద్దడం వల్ల ఫలితం ఉంటుంది.

కొబ్బరి నూనెను నోట్లో వేసుకుని పుక్కిలించడం వల్ల కూడా దంతాలు తెల్లబడతాయి. 

ప్రతిరోజూ మూడు లేదా నాలుగు గంటల పాటు బ్లీచింగ్ జెల్‌తో తయారు చేసిన ట్రేను దంతాలపై ధరించడం వల్ల కూడా ఫలితం ఉంటుంది. 

హైడ్రోజన్ పెరాక్సైడ్ కలిగి ఉండే కొన్ని వైటెనింగ్ రిన్స్‌లు మార్కెట్లో దొరుకుతాయి. అవి కూడా దంతాలపై పసుపు రంగును పోగొట్టి తెల్లగా మారుస్తాయి. 

రెండు వారాల పాటు బేకింగ్ సోడాతో పళ్లు తోముకుంటే ఫలితం కనబడుతుంది.