మాటిమాటికీ ముఖం కడుగుతున్నారా.. ఎక్కువసార్లు చేస్తే ఏమవుతుందో తెలుసా..

ఎదుటివారు చూసేందుకు ఫ్రెష్‌గా, అందంగా కనిపించాలనే తాపత్రయంతో పదే పదే ఫేస్ వాష్ చేయడం చాలామందికి అలవాటు

 ఎక్కడకు వెళ్లినా ఫేస్ వాష్ లిక్విడ్ తమ వెంట తప్పకుండా తీసుకెళుతున్నారు

సాధారణంగా ఏ చర్మతత్వం ఉన్నవారైనా సరే రోజుకు రెండుసార్లకు మించకుండా మీ ముఖాన్ని కడగాలి

ఉదయం నిద్రలేచిన తర్వాత ఒకసారి, రాత్రి పడుకునే ముందు మరోసారి తప్పక శుభ్రపరచుకోవాలి. 

సాధారణ చర్మం, జిడ్డు చర్మం లేదా మొటిమల సమస్యలతో బాధపడేవారు అవసరాన్ని బట్టి 2 సార్లకు మించి ముఖాన్ని శుభ్రపరచుకోవచ్చు.      

 ఇందుకు రసాయనాల గాఢత ఎక్కువగా లేని స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ మాత్రమే వాడాలి

చర్మ సంబంధిత సమస్యలు ఉన్నవారు ముఖం మురికిగా, జిడ్డుగా మారిన వెంటనే ముఖం కడగాలి