నోట్లో వేసుకుంటే కరిగిపోయే
రవ్వ కేసరి 10నిలో..
ఇంకెందుకు ఆలస్యం రవ్వ కేసరికి కావాల్సిన పదార్థాలేంటి? ఎలా ప్రిపేర్ చేసుకోవాలి? అన్నది ఈ స్టోరీలో తెలుసుకుందాం.
1/2 కప్పు - సూజీ(రవ్వ),3 టేబుల్ స్పూన్లు - నెయ్యి,1/2 కప్పు - పాలు,2 1/2 కప్పు - నీరు,3/4 కప్పు - బెల్లం,3-4 - కుంకుమ పువ్వు,3 టీస్పూన్స్ - ఎండు ద్రాక్ష,3 టీస్పూన్స్ - జీడిపప్పు,3 టీస్పూన్స్ - బాదం,1 టీస్పూన్ - సోంపు
ముందుగా స్టౌ మీద ఒక పాన్ పెట్టుకొని, అందులో నెయ్యి వేసుకోవాలి.
అందులో సోంపు గింజలు వేసి అవి చిటపటలాడే వరకు వేయించుకోవాలి.
ఇప్పుడు అందులో రవ్వ వేసుకొని అది గోధుమరంగులోకి వచ్చే వరకు వేయించుకొని పక్కన పెట్టేసుకోవాలి.
అదే పాన్లో బెల్లం, వాటర్ వేసి కరిగించుకోవాలి
ఆ మిశ్రమంలో పాలు, కుంకుమపువ్వు యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఆపై వేయించి పక్కన పెట్టుకున్న సూజీ(రవ్వ) వేసి ఉడికించుకోవాలి.
ఆ మిశ్రమం చిక్కగా మారడం ప్రారంభించిన తర్వాత.. జీడిపప్పు, బాదం, ఎండుద్రాక్షను కాస్త ఫ్రై చేసుకొని అందులో వేసుకోవాలి.
ఆపై మొత్తం మిశ్రమాన్ని మరో 2-3 నిమిషాలు ఉడికించుకోవాలి. అంతే.. నోరూరించే రుచికరమైన సూజీ హల్వా రెడీ!
Related Web Stories
చర్మం తళతళలాడాలంటే..
స్టీల్ పాత్రల్లో ఇవి పెడుతున్నారా జర భద్రం
ఏనుగుల గురించి ఈ విషయాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు!
బియ్యం నీటితో ముఖం కడుక్కుంటే జరిగేది ఇదే..