చర్మం తళతళలాడాలంటే..

నెయ్యి అంటే చాలా మందికి ఇష్టం. దీనిని తీసుకోవడం వల్ల అనారోగ్య సమస్యలు వస్తాయని.. భయంతో తినకుండా ఆగి పోతారు.

నెయ్యిని మితంగా తీసుకోవడం వల్ల పలు ఆరోగ్య ప్రయోజనాలు పొంద వచ్చని  అంటున్నారు.

గోరు వెచ్చని పాలలో ఒక చెంచా నెయ్యి కలిపి తాగడం వల్ల వారం రోజుల్లో శరీరానికి అద్భుత ప్రయోజనాలు కలుగుతాయంటున్నారు.

కీళ్ల నొప్పులతో బాధపడే వారు పాలలో నెయ్యి కలిపి తీసుకోవటం వల్ల ఉపశమనం లభిస్తుందని పేర్కొంటున్నారు.

పాలు,నెయ్యి కలిపి తీసుకోవటం వల్ల చర్మం తళతళ మెరిసేలా చేస్తుందని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు.

పాలతో నెయ్యి కలిపి తీసుకోవడం వల్ల జీవక్రియ పెరిగి.. బరువు అదుపులో ఉంటుందని పేర్కొన్నారు

రాత్రి పూట పడుకునే ముందు గోరు వెచ్చని పాలలో నెయ్యి కలుపుకుని తీసుకుంటే నిద్ర బాగా పడుతుందని అంటున్నారు.