ఇళ్లలో చాలా మంది స్టీల్ పాత్రలు వినియోగిస్తుంటారు.

ఈ స్టీల్ కంటైనర్లను ఎక్కువగా కిరాణా సామాగ్రిని నిల్వ చేయడానికి ఉపయోగిస్తుంటారు.

లంచ్ బాక్స్‌ల, పప్పులు, చక్కెర మొదలైన వాటిని నిల్వ చేయడానికి రకరకాల స్టీల్‌ పాత్రలను వినియోగిస్తారు.

స్టీల్ పాత్రలో నిల్వ చేయకూడనివి

ఊరగాయలు,పెరుగు,సిట్రస్ ఆహారాలు, టమోటా ఆధారిత వంటకాలు,పండ్లు – సలాడ్లు, ఉప్పు

పచ్చళ్లను ఎప్పుడూ స్టీల్ పాత్రలో నిల్వ చేయకూడదు. ఉప్పు, వెనిగర్, నూనె మిశ్రమంగా ఉండే ఊరగాయలు సహజ ఆమ్లాలతో నిండి ఉంటాయి.

పెరుగు సహజంగా ఆమ్లత్వం కలిగి ఉంటుంది. కాబట్టి స్టీల్ కంటైనర్‌లో ఎక్కువసేపు దీనిని నిల్వ చేస్తే దాని రుచి చెడిపోతుంది.

ఉప్పును స్టీల్ పాత్రలలో అస్సలు నిల్వ చేయకూడదు. ఎక్కువసేపు ఉప్పును నిల్వ చేయడం వల్ల ఉప్పులోకి తేమ చేరి, ఉప్పు నాణ్యతను ప్రభావితం చేస్తుంది.