పచ్చిరొయ్యలు వంకాయ ఇగురు కూర ఇలా వండారంటే గిన్నె మొత్తం ఊడ్చేస్తారు,
కావలసిన పదార్థాలు
పచ్చి రొయ్యలు వంకాయలు -అల్లం వెల్లుల్లి గరం మసాలా కరివేపాకులు పసుపు ఉప్పుకారం పచ్చి రొయ్యలు వంకాయలు అల్లం వెల్లుల్లి పేస్టు గరం మసాలా కరివేపాకులు పసుపు ఉప్పు కారం నూనె
పచ్చి రొయ్యలను శుభ్రంగా కడిగి ఒక గిన్నెలో వేయాలి.
వంకాయలను శుభ్రంగా కడిగి ముక్కలుగా కోసి నీటిలో వేసుకోవాలి.
ఉల్లిపాయలను, పచ్చిమిర్చిని కూడా సన్నగా తరిగి పక్కన పెట్టాలి.
కళాయిలో నూనె వేసి సన్నగా తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చిని వేసి బాగా కలుపుకోవాలి.
అల్లం వెల్లుల్లి పేస్ట్ ను వేసి బాగా వేయించాలి.
వంకాయ ముక్కలను వేసి ఉప్పు చల్లాలి.
పచ్చి రొయ్యలను వేసి కలుపుకొని మూడు నిమిషాల పాటు వేయించుకోవాలి.
గరం మసాలా వేసి కలపాలి.రొయ్యలు ఉడకడానికి సరిపడా నీళ్లను కూడా వేసి బాగా కలుపుకోవాలి.
పది నిమిషాల పాటు మూత పెట్టి ఉడికించాలి. ఆ తర్వాత ఇగురు లాగా అవుతుంది.
కొత్తిమీర చల్లుకొవాలి అంతే టేస్టీ పచ్చి రొయ్యలు వంకాయ ఇగురు రెడీ అయినట్టే.