రిటైర్‌మెంట్ తరువాత కొన్ని మార్పులు చేసుకుంటే జీవితాన్ని సరికొత్తగా ఆస్వాదించవచ్చు

పదవీ విరమణ తరువాత లభించే సమయాన్ని మనసుకు నచ్చిన హాబీలపై వెచ్చించాలి

హాబీలపై దృష్టి పెట్టడంతో పాటు కసరత్తులు, కాలక్షేపాలకు తగు సమయాన్ని కేటాయించాలి

ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. కసరత్తులతో పాటు క్రమం తప్పకుండా హెల్త్ చెకప్స్‌ చేయించుకోవాలి

ఈ వయసులో మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు పుస్తకపఠనం వంటి వాటిపై దృష్టి పెట్టాలి

కుటుంబం, స్నేహితులు, బంధువుల కోసం ఎక్కువ సమయం కేటాయిస్తూ మానసిక బంధాలను ఏర్పరుచుకోవాలి

ఖాళీ సమయాల్లో నచ్చిన ప్రదేశాలకు టూర్‌లు వేయడం కూడా మనసుకు ఉల్లాసాన్ని ఇస్తుంది. 

ఈ తీరిక సమయాల్లో స్వచ్ఛంద సంస్థల్లో వలంటీర్లుగా పనిచేస్తూ సమాజానికి ఎంతో కొంత మేలు చేయొచ్చు.