చికెన్ వండిన అంత ఈజీగా మటన్‌ వండలేమని చెబుతుంటారు. ఎందుకంటే.. చికెన్‌ త్వరగా ఉడికిపోతుంది. కానీ, మటన్‌ అలా కాదు..ఉడకడానికి ఎక్కువ సమయం పడుతుంది.

 చికెన్‌, మటన్‌ ఏదైనా సరే… నాన్‌వెజ్‌ ఆహారం వండేప్పుడు కొన్ని చిట్కాలు పాటించటం వల్ల అది ఈజీగా ఉడికిపోతుంది.

 ముఖ్యమైన విషయం ఏంటంటే.. మాంసం ముక్కకల పరిమాణం సమంగా ఉండాలని గుర్తించుకోండి. చాలా పెద్ద ముక్కలు ఉంటే ఉడకటం కష్టంగా అవుతుంది

 నాన్‌వెజ్‌ ఉడకబెట్టే  ముందు బాగా కడగాలి.  అప్పుడే రక్తం, మలినాలు తొలగిపోతాయి.  మాంసం త్వరగా మెత్తబడుతుంది.

 మాంసానికి నిమ్మరసం లేదా వెనిగర్ బాగా పట్టించాలి. కొద్దిగా నిమ్మరసం లేదా వెనిగర్ కలిపితే మటన్, చికెన్ త్వరగా ఉడికిపోయేలా చేస్తుంది.

 కొద్దిగా పచ్చి బొప్పాయి పేస్ట్ వేస్తే.. మటన్ త్వరగా ఉడుకుతుంది.  ఓపెన్ పాత్ర కంటే  ప్రెషర్ కుకర్‌లో  త్వరగా ఉడుకుతుంది.

మటన్ వండటానికి ఒక గంటసేపు ముందు పెరుగులో నానబెట్టి ఆ తర్వాత వండితే సరి.. మటన్ తొందరగా ఉడికిపోతుంది.

కూర వండేటప్పుడు తాలింపులో అల్లం వెల్లుల్లి పేస్ట్‌ను ఉపయోగిస్తుంటాం. అలా కాకుండా ముందు అల్లం తురుము వేసి.. అది మగ్గాక ఆపై అల్లం వెల్లుల్లి పేస్ట్‌ వేస్తే మటన్‌ త్వరగా ఉడుకుతుందంటున్నారు నిపుణులు.

 ఇలాంటి చిట్కాలు పాటిస్తూ మీకు ఇష్టమైన మటన్‌, చికెన్‌ని ఈజీగా వండుకుని,ఇక ఆలస్యం ఎందుకు… ఈ ట్రిక్స్ ట్రై చేసి హ్యాపీగా లాగించేయండి!