ఏ ఇంట్లో అయినా అప్పుల సమస్యలు ఉంటాయి. ఆర్థిక సమస్యల నుంచి బయట పడానికి చాలా మంది ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు.
కొంత మంది ఆర్థిక కారణాల వల్ల అప్పులు చేస్తూ ఉంటే.. మరికొంత మంది జల్సాలకు అలవాటు పడి కావాలని అప్పులు చేస్తారు.
కానీ ఇప్పుడు చెప్పే చిట్కాలు ట్రై చేస్తే.. వాటి నుంచి త్వరగా బయట పడతారు..
అప్పుల భారం తగ్గాలంటే మొదట తగ్గించాల్సింది ఖర్చులే. అవసరం లేని షాపింగ్, విలాసాలు, ఆడంబరాలు కొంతకాలం పక్కన పెట్టడం తప్పనిసరి.
ప్రతి నెల మీ ఆదాయం ఎంత, ఖర్చు ఎంత అన్నది లెక్కలో పెట్టాలి. ఆదాయానికి మించి ఖర్చు చేసే అలవాటు ఉంటే అప్పులే మిగులుతాయి.
వడ్డీ ఎక్కువగా పడే అప్పులు మిగిలిపోతే భారం మరింత పెరుగుతుంది. అందుకే ముందుగా అధిక వడ్డీ ఉన్న అప్పులను క్రమంగా తీర్చేందుకు ప్రయత్నించాలి.
అత్యవసర పరిస్థితి కాకపోతే కొత్త అప్పులకు దూరంగా ఉండటం చాలా ముఖ్యం.
Related Web Stories
చలికాలంలో జీవక్రియలు వేగవంతం అయ్యేందుకు టిప్స్
ఆకట్టుకుంటున్న అందమైన చిత్రాలు
రంగురంగుల రంగవల్లులతో మెరిసిన ఎస్ఆర్ఆర్ అండ్ సీవీఆర్ కాలేజీ మైదానం..
ఉడుతను పరుగెత్తించిన కాకులు..యూనిటీ అంటే ఇదే..