వామ్మో.. వెరైటీ ఫోబియాలు..  వీటి గురించి మీకు తెలుసా

మనుషులకు రకరకాల భయాలుంటాయి. అయితే కొందరు ప్రతి చిన్న విషయానికి అనవసరంగా భయపడుతుంటారు. విచిత్రమైన ఫోబియాలతో బాధపడుతుంటారు. అవేంటో చూద్దాం..

నిక్టోఫోబియా కొందరు వ్యక్తులు చీకటి అంటే చాలా భయపడతారు. రాత్రి వేళల్లో వీరు ఒంటరిగా ఉండలేరు. దీనిని అచ్లువోఫోబియా అని కూడా అంటారు. 

ఆర్కనోఫోబియా కొందరు బల్లులు, బొద్దింకలను చూసి భయపడుతుంటారు. ఇంట్లో అవి కనిపించిన చోటుకు వెళ్లాలంటేనే భయపడిపోతారు. అవి దగ్గరకు వస్తాయేమోనని అనుమానపడుతుంటారు. 

ఆక్రోఫోబియా చాలా మంది ఎత్తైన ప్రదేశాలంటే భయపడతారు. ఎత్తైన కొండలు, భవనాలు ఎక్కినపుడు చాలా ఆందోళన పడుతుంటారు. లిఫ్ట్‌లో వెళ్లేందుకు కూడా భయపడతారు.

ఆంథో ఫోబియా విచిత్రంగా కొందరు పువ్వులు అంటే భయపడిపోతారు. పువ్వులను చూసినా, వాటి వాసన వచ్చినా తట్టుకోలేరు. 

హిమో ఫోబియా కొందరు రక్తాన్ని చూసి భయపడతారు. రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన వారిని చూసినా, రక్తస్రావం అవుతున్న వారిని చూసినా వీళ్లు కళ్లు తిరిగి పడిపోతారు. 

పైరో ఫోబియా కొందరు మంటలు అంటే చాలా భయపడతారు. మంటలను చూసి వీరు ఆందోళన చెందుతుంటారు. 

నోసో ఫోబియా ఏ చిన్న అనారోగ్యం వచ్చినా ఎక్కువగా బాధపడిపోతుంటారు. అనవసరంగా ఎక్కువ మందులేసుకుని అతిగా ఆలోచిస్తూ ఉంటారు. 

థానటో ఫోబియా బంధువుల్లో, స్నేహితుల్లో ఎవరైనా చనిపోతే తమకు కూడా మరణం తప్పదని అనవసర భయాలు పెంచుకుని మధనపడుతుంటారు. కొందరు డిప్రెషన్‌లోకి కూడా వెళ్లిపోతుంటారు.