ఆదివారం వచ్చిందంటే చాలు.. నాన్ వెజ్ వైపు మనసు మళ్లుతుంది. చికెన్, మటన్, లేదా చేపలు తినేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు
చేపలు కొనేటప్పుడు మోసపోకుండా జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే చేపలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి కానీ పాత చేపలు తినడం వల్ల ఆరోగ్యానికి ప్రమాదం కలగొచ్చు.
చేపల్ని కొనేటప్పుడు ఈ చిట్కాలు ఫాలో చేయండి.
చేపలు మెరుస్తూ మంచి రంగులో ఉండాలి. చేపల కళ్లను చెక్ చేయాలి. స్పష్టంగా ఉంటే అది మంచి చేప అని అర్థం. చేపల కళ్ళు మబ్బుగా ఉంటే, దానిని కొనవద్దు.
మీ వేలితో చేప శరీర భాగాన్ని నొక్కండి. గట్టిగా ఉంటే మంచి చేప. అది మృదువుగా ఉంటే తినడానికి పనికి రాని చేపగా గుర్తించాలి.
మొప్పల రంగు ఎర్రగా లేదా తేమతో కూడిన గులాబీ రంగులో ఉంటే అవి తాజా చేపలని గుర్తించాలి. అలాకాకుండా నిస్తేజంగా, గోధుమ రంగు పొలుసులను కలిగి ఉంటే ఆ చేప మంచిది కాదని అర్ధం చేసుకోవాలి.
తాజా చేప తోకను పట్టుకున్నప్పుడు మెరుస్తుంది. అదే కొద్ది రోజులు నిల్వ ఉన్న చేపల శరీరభాగం వదులుగా మారి, మృదువుగా మారుతుంది.
అదే విధంగా చేప నుంచి మరీ చెడు వాసన వస్తే అది నిల్వ ఉన్న చేపగా చెప్పొచ్చు. తాగా చేప అంత చెడు వాసన రాదు.