గోడ మీద బల్లి ఉందా..  తరిమికొట్టేందుకు ఇలా చేయండి..

వంటగదిలో బల్లులు తిరుగుతూ ఉంటే.. ఉల్లిపాయ ముక్కలుగా కోసి ఉంచండి.

వీలైతే తీగకు కట్టి వేలాడదీయండి. ఆ ఘాటుకు బల్లి అటువైపుకి రానేరాదు.

వెల్లుల్లికి కూడా ఉల్లిపాయలాగే ఘాటైన వాసన ఉంటుంది.

వెల్లుల్లిని కోసి తలుపులు, కిటీకీల మధ్యగా ఉంచితే బల్లులు వాటిమధ్యగా తిరగవు లేదా వెల్లుల్లి ముద్దను నీళ్లలో కలిపి ఇంట్లో స్ప్రే చేసినా బల్లుల బాధ తప్పుతుంది.

పెప్పర్ స్ప్రే ఘాటు కూడా ఇంట్లో ఉన్న బల్లులను తరిమేస్తుంది.

ఇంట్లో బల్లులు తిరిగే ప్రదేశాల్లో చిల్లీ స్ప్రే చల్లినా అవి అక్కడ నుంచి పారిపోతాయి.