రాగి పాత్రలు కొత్తవాటిలా  మెరవాలంటే ఇలా క్లీన్ చేయండి.. 

ఒక గిన్నెలో నాలుగు చెంచాల ఉప్పు, రెండు చెంచాల నిమ్మరసం వేసి బాగా కలపాలి. 

పలుచని వస్త్రనికి ఈ మిశ్రమాన్ని అద్ది దాంతో రాగి వస్తువులను తోనూలి రెండు నిమిషాల తరవాత మంచినీటితో శుభ్రం చేయాలి.

తరువాత పొడిగుడ్డతో తుడిస్తే అవి కొత్తవాటిలా మెరుస్తాయి.

ఆ గిన్నెలో మూడు చెంచాల వెనిగర్, రెండు చెంచాల బేకింగ్ సోడా వేసి పేస్టులా కలపాలి. 

దూది ఉండ సహాయంతో ఈ మిశ్రమాన్ని రాగి వస్తువులకు పూతలా పట్టించాలి. 

పావుగంటసేపు అలాగే ఉంచాలి. తరువాత తడిగుడ్డతో శుభ్రంగా తుడిస్తే వాటిపై పేరుకున్న నలుపుదనం తొలగిపోతుంది.

 టమాటా రసంలో స్క్రబ్బర్ ముంచి దాంతో రాగి వస్తువులను తోమితే వాటిపై పేరుకున్న నలుపుదనం, దుమ్ము, ధూళి తొలగిపోతాయి.