ఏ సైజు టీవీని  ఎంత దూరం నుంచి చూడాలి? 

పెద్ద టీవీల ముందు తక్కువ దూరంలో కూర్చుని చూస్తే కళ్లపై ప్రభావం పడుతుంది.

24 అంగుళాల టీవీని చూడటానికి గరిష్ట దూరం 5 అడుగుల కంటే ఎక్కువ ఉండకూడదు

టీవీ పరిమాణం 32 అంగుళాలు ఉంటే మీరు కనీసం 6 అడుగుల, గరిష్టంగా 7 అడుగుల దూరం నుండి చూడటం ఉత్తమం

మీ టీవీ 40 అంగుళాలు ఉన్నట్లయితే 8 అడుగుల దూరంగా ఉండి టీవీ చూడాలని గుర్తించుకోండి. 

50 అంగుళాల స్క్రీన్‌ పరిమాణం ఉన్న టీవీ కోసం 6.25 నుంచి 10.5 అడుగుల దూరం మెయింటెయిన్‌ చేయాలి.

60 అంగుళాల స్క్రీన్‌ పరిమాణం ఉన్న టీవీ విషయంలో 7.5 అడుగుల నుంచి 12.5 అడుగుల దూరం ఉండాలని గుర్తించుకోండి.

దగ్గరగా ఉండి చూస్తే కళ్లపై తీవ్ర ప్రభావం పడుతుందని నిపుణులు సూచిస్తున్నారు.