చైనాలో హ్యూమన్‌ మెటానిమోవైరస్‌ విజృంభిస్తోంది

హెచ్‌ఎంపీవీ లక్షణాలు కొవిడ్‌-19 రుగ్మతలనే పోలి ఉంటాయి

ఈ వైరస్‌ నిమోనియాకు దారితీయవచ్చు

ఇన్‌ఫెక్షన్‌ వచ్చిన 3-6 రోజులలో హెచ్‌ఎంపీవీ లక్షణాలు బయటపడతాయి

ఇన్‌ఫెక్షన్‌ వల్ల ఆస్థమా తీవ్రం కావచ్చు

కొవిడ్‌-19 లానే చిన్నారులు, వృద్ధుల పై , ఎక్కువ ప్రభావం చూపించే అవకాశం ఉంది

గత నెల 16 నుంచి 22 మధ్య చైనాలో శ్వాసకోశ ఇన్‌ఫెక్షన్లు పెరిగాయి

నిమోనియా, వైట్‌ లంగ్‌ కేసులతో పిల్లల ఆసుపత్రులు నిండిపోతున్నాయి

ఇన్‌ఫ్లూయెంజా ఎ, మైకోప్లాస్మా నిమోనియై, కొవిడ్‌-19 వైరస్‌లు కూడా వేగంగా వ్యాప్తి చెందుతున్నాయి