కొన్ని అలవాట్లను అలవర్చుకుంటే జీవితంలో దాదాపుగా అన్ని సమస్యలు పరిష్కారమవుతాయి.

జీవితంలో మీకున్న సానుకూలతలను నిరంతరం మననం చేసుకుంటూ కృతజ్ఞతాభావాన్ని పెంచుకోవాలి

ప్రతికూల పరిస్థితుల్లో తొందరపాటుతో స్పందించకుండా ఆచితూచి ముందడుగు వేయాలి

సమస్యల గురించి అతిగా ఆలోచించకుండా పరిష్కార మార్గాలపై దృష్టి పెట్టాలి. 

నిరంతరం కొత్త విషయాలు నేర్చుకుంటూ ఉంటే ఏ పరిస్థితినైనా తట్టుకుని నిలబడొచ్చు

జీవితంలో ఏం చేసాధించాలన్నా ఆరోగ్యమే పునాది. ఈ విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్లక్ష్య్ం వద్దు 

సానుకూల దృక్పథం ఉన్న వారి సాంగత్యంతో మనకూ ఆ తరహా మనస్తత్వం అలవడి విజయం సాధించొచ్చు.

మన చేతుల్లో లేని విషయాలను వెంటనే వదిలిపెట్టగలగడం వల్ల ప్రతికూల ఆలోచనలు దరిచేరకుండా ఉంటాయి.