మహిళలు త్వరగా పెద్దవారిగా కనిపించడానికి ఇదే కారణం..
కొందరు 35 ఏళ్లకే వారు 50 ఏళ్ల వయస్సు ఉన్నవారిలా కనిపిస్తారు.
ఒత్తిడి మీ మానసిక ఆరోగ్యాన్ని మాత్రమే కాకుండా మీ ముఖ రూపాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. ఇది మిమ్మల్ని త్వరగా పెద్దవారిగా కనిపించేలా చేస్తుంది.
ఒత్తిడిని తగ్గించడానికి నడక, వ్యాయామం, ధ్యానం వంటి వ్యాయామాలు చేయాలి.
నిద్ర లేకపోవడం వల్ల కూడా చర్మంపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. ఇది మహిళల్లో అకాల వృద్ధాప్యానికి కారణమవుతుంది.
అందువల్ల మహిళలు చర్మాన్ని యవ్వనంగా ఉంచుకోవడానికి ప్రతిరోజూ కనీసం 7 నుంచి 8 గంటలు నిద్రపోవాలి.
ఇటీవలి పరిశోధనలలో కోపం అకాల వృద్ధాప్యానికి దారితీస్తుందని తేలింది. కాబట్టి మహిళలు తమ కోపాన్ని కట్రోంల్ చేసుకోవడం మంచిది.
సూర్యరశ్మి చర్మ కణాలను దెబ్బతీస్తుంది. చర్మం పొడిబారడానికి, ముడతలు, మచ్చలను అభివృద్ధి చేయడానికి కారణమవుతుంది.
అందువల్ల మహిళలు ప్రతిరోజూ సన్‌స్క్రీన్ ఉపయోగించడం చాలా ముఖ్యం
ధూమపానం, మద్యం సేవించడం వల్ల మహిళల చర్మం పొడిబారి, మసకబారుతుందని నిపుణులు అంటున్నారు.
అందుకే మహిళలు ధూమపానం, మద్యం సేవించడం వంటి అలవాట్లను పూర్తిగా మానేయాలి.
Related Web Stories
పాములు ఇంట్లోకి రాకుండా ఉండాలంటే ఇలా చేయాల్సిందే..!
తెలంగాణ వ్యాప్తంగా పలు జిల్లాలను వర్షాలు వణికిస్తున్నాయి.
రాగి సీసాలో నీరు మంచిదే కానీ.. ఈ తప్పులు చేస్తే ముప్పే!
ఓట్స్ vs అటుకులు: రెండింటిలో ఏది ఆరోగ్యకరం..