తెలంగాణ వ్యాప్తంగా పలు జిల్లాలను  వర్షాలు వణికిస్తున్నాయి.

వర్షాల ధాటికి పలు ప్రాంతాలు జలమయం అవుతున్నాయి. లోతట్టు ప్రాంతాలు చెరువులను తలపిస్తున్నాయి.

వనపర్తి జిల్లాను సైతం వర్షాలు వణికిస్తున్నాయి. జిల్లాలోని వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి.

భారీ వర్షాలకు పలు గ్రామాలు, చెక్ డ్యామ్‌లు, పంట పొలాలు వరదనీటితో నిండిపోయాయి

ఇళ్లల్లోకి సైతం నీరు వచ్చి చేరడంతో ఆయా గ్రామాల ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు.

మరోవైపు గ్రామాలకు వెళ్లే ప్రధాన రహదారులపైనా వరదనీరు భారీగా పారుతోంది.

దీంతో గ్రామాల మధ్య వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది.

కొత్తకోట మండలం పామపురంలో ఊకచెట్టు వాగులో ఉన్న 33 అడుగుల శివుని విగ్రహం నీట మునిగింది.

నదీ పరివాహక ప్రాంతాలు, లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.

కాగా, ఉత్తర, తూర్పు బంగాళాఖాతంలో వాయుగుండం కారణంగా ఈ భారీ వర్షాలు కురుస్తున్నాయి.