గోంగూర రొయ్యల కర్రీ ..  ఇలా చేస్తే సూపర్ టేస్ట్

పాన్‌ తీసుకొని కాస్త నూనె వేసి, వేడి అయ్యాక పచ్చి మిర్చి, గోంగూర ఆకులు వేసి ఉడికించాలిగోంగూర ఉడికిన తరువాత తీసి పక్కన పెట్టుకోవాలి.

బాగా మెత్తగా కావాలనుకుంటే మిక్సీలో వేసి పేస్టులా చేసుకోవచ్చు.

తరువాత అదే పాన్‌లో నూనె వేసి కాస్త వేడి అయ్యాక ఆవాలు, ఉల్లిపాయ వేసి వేగించాలి. 

ఉల్లిపాయలు వేగాక పసుపు,అల్లం వెల్లుల్లి పేస్టు వేయాలి.

ధనియాల పొడి, జీలకర్ర పొడి, ఉప్పు వేయాలి.

ఇప్పుడు శుభ్రం చేసి పెట్టుకున్న రొయ్యలు వేసి కలిపి మరికాసేపు వేగనివ్వాలి.

చివరగా గోంగూర పేస్టు వేసి కలపాలి. మరికాసేపు ఉడికించి దించాలి.

అన్నంతో లేదా చపాతీతో గోంగూర రొయ్యల కూర తింటే రుచిగా ఉంటుంది.