రాఖీ పండక్కి మీ సోదరికి  ఈ గిఫ్ట్ ఇస్తే  ఫుల్ ఖుషి అయిపోతుంది..

 'రక్షా బంధన్' తోబుట్టువులకు పవిత్రమైన పండుగ.  ప్రతి కష్టంలో సోదరులు తోడుంటారనే విశ్వాసానికి గుర్తు.

రాఖీ అంటే రక్షణ అని అర్థం. సోదరి తన సోదరుడికి రాఖీ కట్టి జీవితంలో ఉన్నత స్థానాలను చేరుకోవాలని ఎల్లవేళలా అండగా, రక్షణగా ఉండాలని ఆకాంక్షిస్తారు.

ఈ రోజున సోదరీమణులు తమ సోదరుల మణికట్టుకు 'రాఖీ' అనే పవిత్ర దారాన్ని కట్టి, సోదరుల దీర్ఘాయువు, శ్రేయస్సు కోసం ప్రార్థిస్తారు.

బదులుగా.. సోదరులు తమ సోదరీమణులను ఆపదలో రక్షిస్తామని మాటిస్తారు.

ఈ సందర్భంగా సోదరులు తమ సోదరికి ఏదైనా  బహుమతిగా ఇస్తారు.

అందమైన టెడ్డీ బేర్స్  చెల్లెళ్లకు సరైనవి. ఇది బహుమతి మీ సోదరికి ఎంతగానో నచ్చుతుంది.

మీ సోదరి మ్యూజిక్ లవర్ అయితే.. వారికి మంచి ఇయర్ బడ్స్ బహుమతిగా ఇవ్వొచ్చు.

స్మార్ట్ రింగ్‌లు కూడా మంచి గిఫ్ట్. ఆరోగ్యంపై ఆసక్తి ఉన్నవారికి స్మార్ట్ రింగ్‌లు బాగా ఉపయోగపడతాయి.