రాత్రిళ్లు నిద్ర రావట్లేదా? అయితే ఇవి తినడం వెంటనే మానేయండి!

రాత్రిపూట బాగా నిద్ర పట్టాలంటే.. పడుకునే ముందు కొన్ని ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలని వైద్యులు చెబుతున్నారు.

మాంసంలో కొవ్వు, ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి, ఇవి జీర్ణం కావడానికి చాలా సమయం పడుతుంది.

రాత్రిళ్లు కారంగా ఉండే ఆహారం తినడం వల్ల కడుపు సమస్యలు వస్తాయి.

రాత్రి భోజనం తర్వాత కాఫీ తాగే అలవాటు నిద్రలేమికి దారితీస్తుంది. అందుకే సాయంత్రం తర్వాత కాఫీ తాగకూడదు.

కాఫీ లాగే, టీలో కూడా కెఫీన్ ఉంటుంది. కాబట్టి పడుకునే ముందు టీ తాగడం వల్ల నిద్రపై ప్రభావం పడుతుంది.

జంక్ ఫుడ్‌లో అధిక మొత్తంలో సంతృప్త కొవ్వులు ఉంటాయి. ఇటువంటి ఆహారాలు త్వరగా జీర్ణం కావు.