ఈ ఆహారాలు తింటే బట్టతల గ్యారెంటీ..!

బట్టతల ఒకప్పుడు చాలా అరుదుగా కనిపించేది. ఇప్పుడు మాత్రం చాలా మందిలో బట్టతల సమస్య కనిపిస్తోంది.

చిన్న వయసులోనే బట్టతల వచ్చిన వారు తిరిగి జుట్టు పొందడానికి నానా అవస్థ పడుతుంటారు.

జుట్టు రాలడానికి చక్కెర ఎక్కువగా తీసుకోవడం కూడా ఒక కారణం. చక్కెర ఎక్కువగా తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయి.

ఫాస్ట్ ఫుడ్, వేయించిన ఆహారాలలో అధిక మొత్తంలో అనారోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి. ఇవి జుట్టును బలహీనపరుస్తాయి. జుట్టు రాలే ప్రమాదాన్ని పెంచుతాయి.

ఉప్పు ఎక్కువగా తీసుకోవడం వల్ల   జుట్టు మూలాలు బలహీనపడి జుట్టు రాలడం జరుగుతుంది.

కెఫిన్ ఎక్కువగా తీసుకోవడం వల్ల డీహైడ్రేషన్ కూడా వస్తుంది. దీని వల్ల తల చర్మం పొడిబారిపోతుంది. జుట్టు పెరుగుదలను ప్రతికూలంగా ప్రభావితం చేస్తుంది.

సాధారణంగా జుట్టు రాలడానికి అనేక కారణాలు ఉంటాయి. వీటిలో ఒత్తిడి, కాలుష్యం, పోషకాహార లోపాలు, హార్మోన్ల మార్పులు, చెడు అలవాట్లు ఉన్నాయి. ఇలాంటి సమస్యలు ఉంటే మీరు ఎంత కేర్ తీసుకున్నా జుట్టు రాలే సమస్య తగ్గదు.