ఇంట్లో బల్లులు ఎక్కువగా ఉన్నాయా? ఇలా బయటకు పంపండి..

మీ ఇంట్లో బల్లులు ఎక్కువగా ఉన్నాయా? ఈ సింపుల్ ట్రిక్స్‌తో వాటిని బయటకు పంపించండి.. 

మిరియాల పొడిని నీటిలో కలిపి గోడల మీద స్ప్రే చేయండి. బల్లులు దరి చేరవు. 

వెల్లుల్లి రెమ్మలను, ఉల్లిపాయ ముక్కలను మూలల్లో ఉంచండి. వాటి గాఢమైన వాసన వల్ల బల్లులు వెళ్లిపోతాయి. 

గుడ్ల పెంకుల వాసనను కూడా బల్లులు ఇష్టపడవు. 

నేఫ్తలిన్ బాల్స్ వాసనను కూడా బల్లులు భరించలేవు. 

కాఫీ పొడికి కొంచెం పొగాకు పొడి కలిపి బాల్స్ చేసి వాటిని బల్లులు ఎక్కువగా ఉన్న ప్రదేశంలో ఉంచండి. 

ఇంటి ఆవరణలో పుదీనా లేదా యూకలిప్టస్ మొక్కలను పెంచుకోండి. 

బాగా చల్లగా ఉన్న నీటిని గోడపై స్ప్రే చేసినా బల్లులు అక్కడ ఉండవు. 

పురుగులు చేరకుండా ఇంటిని ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోండి.