కళ్ల కింద డార్క్ సర్కిల్స్..  ఈ సింపుల్ టిప్స్‌తో పోగొట్టుకోండి..!

తగినంత నిద్ర లేకపోవడం, జెనెటిక్స్, చర్మం అలెర్జీల కారణంగా కళ్ల కింద నల్ల మచ్చలు ఏర్పడతాయి. వాటిని సింపుల్ టిప్స్‌తో పోగొట్టవచ్చు. 

కళ్ల కింద ఐస్ ముక్కలతో 5-10 నిమిషాల పాటు రాయండి. లేదా చల్లటి నీటితో తడిపిన తడి గుడ్డను కళ్ల పైనే వేసుకుని కొద్ది సేపు ఉండండి. అలా రెండు నుంచి మూడు రోజుల పాటు చేయాలి. 

టీ బ్యాగ్స్‌ను ముందుగా వేడి నీటిలో నానబెట్టాలి. ఆ తర్వాత వాటిని ఫ్రిజ్‌లో 20 నిమిషాల పాటు చల్లబర్చాలి. ఆ తర్వాత వాటిని కళ్లపై పెట్టుకుంటే ఫలితం ఉంటుంది. 

డార్క్ సర్కిల్స్‌ను పోగొట్టుకోవడానికి కీర దోస కూడా మంచి ఆప్షన్. చల్లని కీర దోస ముక్కలను కళ్లపై 10-15 నిమిషాల పాటు పెట్టుకోవాలి. 

బంగాళాదుంపలను గుండ్రంగా కట్ చేసి ఆ ముక్కలను కూడా కళ్లపై పెట్టుకోవచ్చు. 10-15 నిమిషాల పాటు పెట్టుకున్న తర్వాత చల్లని నీటితో మొహం కడుక్కోవాలి. 

ఆలోవెరా జెల్‌ను తీసి కళ్ల కింద 20 నిమిషాల పాటు మర్దనా చేయాలి. ఆ తర్వాత చల్లని నీటితో కడుక్కోవాలి. 

దూదిని రోజ్ వాటర్‌లో ముంచి కళ్ల కింద 20 నిమిషాల పాటు మర్దనా చేస్తే చక్కని ఫలితం కనబడుతుంది. 

కళ్ల కింద యూవీ కిరణాలు తగలకుండా మంచి సన్ స్క్రీన్ లోషన్ రాసుకోవడం కూడా మంచిది.