సంక్రాంతి పండుగ సెలవుల నేపథ్యంలో నుమాయిష్‌కు జనం క్యూ కడుతున్నారు

నుమాయిష్‌ ‏ 2025 నాంపల్లి ఎగ్జిబిషన్‌ గ్రౌండ్స్‌లో ఏర్పాటు చేసారు

నుమాయిష్‌ను భోగి రోజు - 75,250, సంక్రాంతి రోజు-76500, కనుమ రోజు 69,300 మంది సందర్శించారు

2,21,050 మంది సందర్శకులు పాల్గొన్నారని ఎగ్జిబిషన్‌ సొసైటీ ఉపాధ్యక్షుడు నిరంజన్‌ తెలిపారు

ఎగ్జిబిషన్‌లోని అన్ని స్టాల్స్‌ జనసంద్రంగా మారి సందడి వాతావరణం నెలకొంది

ఎగ్జిబిషన్‌లో ఏర్పాటు చేసిన మినీ ట్రైన్‌ ఎక్కేందుకు జనం బారులు తీరారు

అమ్యూజ్‌మెంట్‌ రైడ్స్‌ ఎక్కేందుకు పిల్లలు పోటీపడ్డారు

పాఠశాలలకు సెలవుల నేపథ్యంలో సందర్శకుల సంఖ్య యింకా పెరిగే అవకాశం ఉందని నిర్వాహకులు చెబుతున్నారు