హైదరాబాద్ లో  తప్పక తినాల్సిన స్ట్రీట్ ఫుడ్స్ ఇవే..

హైదరాబాద్  బిర్యానీ.. హైదరబాద్ బిర్యానీకి కేరాఫ్ అడ్రస్. సుగంధ బియ్యం, లేత మాంసంతో చేసే బిర్యానీ రుచి అమోఘంగా ఉంటుంది.

డబుల్ కా మీఠా.. డబుల్ కా మీఠా హైదరాబాదీల సాంప్రదాయ డెజర్ట్. నెయ్యిలో వేయించిన బ్రెడ్ ముక్కలతో దీన్ని తయారుచేస్తారు. 

హలీమ్..  గోధుమలు, బార్లీ, కాయధాన్యాలు, మాంసం మొదలైనవన్నీ కలిపి హలీమ్ తయారుచేస్తారు.

ఇరానీ చాయ్..  ఇరానీ చాయ్.. ఉస్మానియా బిస్కెట్లు డెడ్లీ కాంబినేషన్. హైదరాబాద్‍లో చాలా ఇరానీ కేఫ్ లలో అందుబాటులో ఉంటుంది.

దబేలి..  గుజరాత్‌కు చెందిన ఈ వంటకం హైదరాబాద్‌లో కూడా హల్చల్ చేస్తోంది.  

మిర్చి బజ్జీ..  మిర్చిబజ్జీలు హైదరబాద్‌లోనే కాకుండా బోలెడు నగరాల్లో సాయంకాలానికి మంచి స్నాక్స్.