సంక్రాంతి రోజున గాలిపటాలు  ఎందుకు ఎగురవేస్తారో తెలుసా..

 సంక్రాంతి పండుగ సందర్భంగా తెల్లవారుజాము నుంచే రంగురంగుల గాలిపటాలు ఎగురుతూ కనిపిస్తాయి. ఇలా ఎందుకు చేస్తారంటే..

సాధారణంగా చలికాలంలో క్రిములు ఎక్కువగా ఉత్పత్తి అవుతాయి. 

 ప్రతి ఒక్కరూ ఇంట్లోనే ఉండటం వల్ల ఎండ పొడ తగలక జలుబు, జ్వరం వస్తుంటాయి.

సూర్యకిరణాలు శరీరాన్ని తాకితే డి- విటమిన్ ఉత్పత్తి అయ్యి సహజంగానే బ్యాక్టీరియా నశిస్తుంది. 

రోగనిరోధక శక్తి పెరిగి ఆరోగ్య ప్రయోజనాలు దక్కుతాయి.

 అంతేగాక, మకర సంక్రాంతి రోజున సూర్యకాంతికి అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని నమ్మకం.

ఈ రోజున శరీరం మీద సూర్య కిరణాలు పడితే అమృతం లాంటివని అంటారు. 

వివిధ వ్యాధులను నయం చేసే శక్తి ఉందని విశ్వసిస్తారు.