పురుషులు టైట్‌గా బెల్ట్ పెట్టుకుంటే పలు సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు.

బెల్ట్‌ను  టైట్‌గా పెట్టుకుంటే కడుపుబ్బరం, యాసిడ్ రిఫ్లేక్స్, మలబద్ధకం వంటివి వస్తాయి. 

కొందరిలో శ్వాస తీసుకునేందుకు అడ్డంకి ఏర్పడి నీరసం పెరుగుతుంది. 

టైట్‌గా బెల్ట్ పెట్టుకునే కొందరిలో తొడల్లోని నరాలపై ఒత్తిడి పెరిగి నొప్పి వచ్చే అవకాశం ఉంది. 

స్కిన్ ర్యాషెస్, దురదలు, లేదా ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం పెరుగుతుంది. 

టైట్‌గా బెల్టు పెట్టుకున్న కారణంగా కొందరు వంకరగా నిలబడి చివరకు నడుం నొప్పి బారిన పడతారు. 

దీర్ఘకాలంలో కోర్ మజిల్స్ బలహీనపడి తీవ్ర అనారోగ్యాలు మొదలవుతాయి. 

రక్తప్రసరణకు కూడా ఆటంకాలు ఏర్పడి పురుషుల్లో సంతానోత్పత్తి కూడా అగ్గే అవకాశం ఉంది.