మీ చర్మం మెరిసిపోవాలంటే.. ఈ పండ్లు తింటే చాలు..

మామిడి పండులో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఈ పండులో ఉండే విటమిన్-సి, యాంటీ ఆక్సిడెంట్లు చర్మాన్ని కాంతివంతంగా చేస్తాయి.

బొప్పాయిలో పపైన్ ఎంజైమ్ ఉంటుంది. ఇది చర్మం కాంతివంతం అవడానికి ఉపయోగపడుతుంది.

ఉసిరికాయలో విటమిన్-సి, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇది వయసు కనిపిచంకుండా చేయడంతో పాటూ ప్రకాశవంతమయ్యేలా చేస్తుంది.

పుచ్చకాయల్లో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. ఇది చర్మాన్ని తేమగా ఉంచడంలో సహాయపడుతుంది. అలాగే చర్మం మెరిసేందుకు ఉపయోగపడుతుంది.

జామపండ్లలో ఉండే విటమిన్-సి, పొటాషియం, ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు చర్మానికి మేలు చేస్తాయి.

దానిమ్మలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి చర్మంపై ఫ్రీ రాడికల్స్‌ను తగ్గించడంతో పాటూ చర్మం దెబ్బతినకుండా కాపాడతాయి.

కొబ్బరి నీళ్లతో పాటూ కొబ్బరి కూడా చర్మానికి మేలు చేస్తాయి. ఈ నీరు చర్మాన్ని తేమగా ఉంచడంలో సహాయపడుతుంది.