సింహాల గురించి  ఈ విషయాలు తెలుసా..

ఫీలైన్ జాతి జంతువుల్లో కలిసిమెలిసి ఉండేవి సింహాలే.

ఇవి ఒక్కోసారి రోజుకు 20 గంటలు వరకూ నిద్రపోతాయి.

వీటి గరిష్ట వేగం గంటకు  50 కిలోమీటర్లు.

మగ సింహం గర్జిస్తే 5 మైళ్ల దూరం దాకా వినిపిస్తుంది.

సింహం నడిచేటప్పుడు దాని కాలి మడమ నేలకు తాకదు.

వేటాడి ఆహారం తెచ్చే  బాధ్యత ఆడ సింహాలదే.

సింహం జూలు రంగును బట్టి వయసు ఎంతో చెప్పొచ్చు.

వయసు పెరిగేకొద్ది జూలు ముదురు రంగులోకి మారుతుంది.