బ‌ద్దకం పోయి రోజంతా ఉత్సాహంగా  ఉండాలంటే... ఈ పనులు చేయండి..

ఉదయాన్నే నిద్రలేవడం మంచి అలవాటు త్వరగా నిద్రలేవడం వలన చేయవలసిన అన్ని పనులను మీరు సమర్ధవంతంగా నిర్వహించగలుగుతారు.

మీరు నిద్రలేచిన వెంటనే మీ మంచాన్ని సరిచేసుకోవడం అలవాటు చేసుకోండి. ఇది మీ మానసిక ఆరోగ్యంపై సానుకూల ప్రభావం చూపుతుంది. 

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, ఉదయాన్నే మంచంపై దుప్పట్లు సరిచేస్తే గ్రహ స్థితి మెరుగుపడుతుంది.

 ఎనర్జిటిక్ గా ఉండాలంటే, నిద్ర లేచిన వెంటనే ఉదయం గాలిలో కొద్దిసేపు నడవడం వల్ల మీ మానసిక స్థితి మెరుగుపడుతుంది.

ప్రతిరోజూ ఉదయం కనీసం రెండు నుంచి ఐదు నిమిషాల పాటు ధ్యానం చేయడం అలవాటు చేసుకోండి.

 ఉదయం చల్లని నీటితో లేదా గోరువెచ్చని స్నానం చేయండి

ఆరోగ్యకరమైన అల్పాహారం తినండి