అరటి తొక్కతో  అద్భుత ప్రయోజనాలు!

అరటి తొక్కలు మిథేన్ వాయువును ఉత్పత్తి చేస్తాయి. వీటిని మొక్కల చుట్టూ వేయడం వల్ల కంపోస్ట్‌లా ఉపయోగపడతాయి.

అరటిపండు తొక్కతో పురుగులను బంధించేందుకు ట్రాప్ తయారు చేయొచ్చు. ప్లాస్టిక్ బకెట్‌లో అరటి తొక్కను వేయడం వల్ల పురుగులు ఆకర్షితమవుతాయి.

దోమలు లేదా ఏదైనా ఇతర కీటకాలు కుట్టినప్పుడు చాలా మంటగా ఉంటుంది. అవి కుట్టిన చోట అరటి తొక్కతో రుద్దడం వల్ల దురద తగ్గుతుంది.

అరటితొక్కలోని తెల్లటి భాగాన్ని మొఖంపై 10 నిముషాల రుద్దాలి. చర్మం మెరిసిపోతుంది.

చేతులు, కాళ్లకు ముళ్లు, చెక్క ముక్కలు గుచ్చుకున్న సందర్భాల్లో దానిపై అరటితొక్కను 30 నిముషాల పాటు ఉంచితే అందులోని ఎంజైమ్‌ల కారణంగా లోపల ఉన్న ముళ్లు బయటికి వస్తుంది.

అరటి పండు తొక్క లోపలి భాగాన్ని తినడం వల్ల రాత్రిళ్లు మంచి నిద్ర పడుతుంది.