దోమలకు ఇష్టమైన బ్లడ్ గ్రూప్ ఏంటో తెలుసా?

   దోమ కుట్టడం వల్ల మనిషికి అనేక జబ్బులు వస్తాయి. డెంగ్యూ ,మలేరియా, చికెన్ గునియా వంటి జబ్బులు దోమల ద్వారా వ్యాపిస్తాయి

  ఈ దోమలు కూడా ఎవరిని పడితే వారిని కుట్టవు..

  వాటికి నచ్చిన బ్లడ్ గ్రూప్ ఉన్నవారిని మాత్రమే ఎక్కువగా కుడతాయట.

 కొందరిని కుట్టకపోవడం, కొందరికి ఎక్కువగా కుట్టడం వెనుక.. దోమల ఆకర్షణకు కారణమైన జీవనశైలి, ఆహారమే ప్రధాన కారణాలని తాజా రిపోర్ట్స్ చెబుతున్నాయి.

  ఓ బ్లడ్ గ్రూప్ తో పాటు A బ్లడ్ గ్రూప్ వారినే దోమలు ఎక్కువగా కుడతాయని నిపుణులు చెబుతున్నారు..

  ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే ఈ దోమల్లో కేవలం ఆడ దోమ మాత్రమే మనుషులను కుడతాయి..