షుగర్ ఉన్న వాళ్లకు..
మొలకలు ఎంత మేలు చేస్తాయంటే..
మొలకల గ్లైసెమిక్ ఇండెక్స్ చాలా తక్కువగా ఉంటుంది. రక్తంలోకి చక్కెర వెంటనే విడుదల అవకుండా నియంత్రిస్తాయి.
మొలకల్లో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఫైబర్ కార్బోహైడ్రేట్ల శోషణను నెమ్మదింపచేస్తుంది.
మొలకలు ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచుతాయి. ఫలితంగా శరీరం గ్లూకోజ్‌ను సమర్థవంతంగా ఉపయోగించుకుంటుంది.
మొలకల్లో విటమిన్-సి, ఫ్లేవనాయిడ్స్ పుష్కలంగా ఉంటాయి. ఇన్సులిన్ రెసిస్టెన్స్‌ను తగ్గిస్తాయి.
మొలకల్లో ప్రోటీన్లు, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. వీటిని తింటే కడుపు నిండిన ఫీలింగ్ ఎక్కువ సేపు ఉంటుంది.
మొలకల్లోని ఎంజైమ్‌లు గట్ హెల్త్‌ను మెరుగుపరుస్తాయి. జీర్ణక్రియకు తోడ్పాటునందిస్తాయి.
మొలకలు మెటబాలిక్ ఫంక్షన్‌ను మెరుగుపరుస్తాయి. పోషకాల శోషణకు ఉపయోగపడతాయి. ఇవి రెండూ బ్లడ్ షుగర్ లెవెల్స్‌ను కంట్రోల్ చేస్తాయి.
మొలకల్లో ఫోలేట్, మెగ్నీషియమ్, ఐరన్ పుష్కలంగా ఉంటాయి. క్యాలరీలు తక్కువగా ఉంటాయి.
మొలకల్లోని యాంటీ-ఆక్సిడెంట్లు ఇన్‌ఫ్లమేషన్, ఆక్సిడేటివ్ స్ట్రెస్‌ను తగ్గిస్తాయి.
Related Web Stories
జుట్టు ఒత్తుగా పెరిగేందుకు ఇది తీసుకోండి
ఈ ఫుడ్స్ తీసుకోండి.. మీ ఊపిరితిత్తులను కాపాడతాయి..
సైక్లింగ్ చేయడం వల్ల కలిగే అద్భుతమైన ప్రయోజనాలివే..
ఈ ఫ్రూట్స్.. మీ లివర్, కిడ్నీలను డీటాక్సిఫై చేస్తాయి..