బాత్రూమ్‌లో టూత్‌బ్రష్ పెట్టడం ఎంత ప్రమాదమో తెలుసా?

బాత్రూంలో కొన్ని వస్తువులు పెట్టుకోవడం ఎంత మాత్రం మంచిది కాదు. మరీ ముఖ్యంగా దంతాలను శుభ్రం చేసుకోవడానికి ఉపయోగించే టూత్ బ్రష్.

ప్రతిరోజూ ఉదయం లేవగానే పళ్లు తోముకోవడంతో దినచర్య మొదలవుతుంది. పళ్లుతోముకోవడానికి ఉపయోగించే టూత్ బ్రష్ లు చాలావరకు బాత్రూమ్ లోనే ఉంచుతుంటారు.

టూత్ బ్రష్ ను బాత్రూమ్ లో ఉంచడం ప్రమాదమంటున్నారు వైద్యులు. టూత్ బ్రష్ ను బాత్రూమ్ లోనే ఉంచడం వల్ల పూ పార్టికల్స్ అనే సమస్య ఏర్పడుతుందట.

  టాయిలెట్‌ను ఫ్లష్ చేసినప్పుడు, కంటికి కనిపించని చిన్న నీటి తుంపరలు గాలిలోకి లేస్తాయి. దీనినే టాయిలెట్ ప్లూమ్ అంటారు.

టాయిలెట్‌ను ఫ్లష్ చేసిన ప్రతిసారీ, అందులోని క్రిములు ఉన్న నీటి బిందువులు గాలిలోకి పైకి లేచి చుట్టూ ఉన్న వస్తువులపై, ముఖ్యంగా మీ టూత్‌బ్రష్ ముళ్లపై పడతాయి.

 ఈ క్రిములు మెల్లగా టూత్‌బ్రష్‌పై చేరి మీరు బ్రష్ చేసినప్పుడు నోటిలోకి వెళ్లే ప్రమాదం ఉంటుంది. దీనివల్ల ఆరోగ్యం పాడవుతుంది.

 దంతాలను శుభ్రం చేశాక టూత్ బ్రష్‌లో 1.2 మిలియన్లకు పైగా బ్యాక్టీరియా ఉంటుందంట. మీరు బాత్రూంలోనే అలా ఉంచితే బాక్టీరియా, ఫంగస్, వైరస్‌లు కూడా కాలక్రమేణా టూత్ బ్రష్‌లో పెరుగుతాయి.