ప్రతి ఒక్కరూ మెరిసే చర్మం, గ్లాసీ స్కిన్ కావాలని కోరుకుంటారు. 

చర్మంపై సంరక్షణపై ప్రతి ఒక్కరూ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. 

అమ్మాయిలు, అబ్బాయిలు తేడా లేకుండా అందం కోసం నానాతంటాలు పడుతున్నారు. 

స్నానం చేసే ముందు తాజా కలబంద జెల్ తీసి ముఖానికి అప్లై చేసి 10-15 నిమిషాలు అలాగే ఉంచండి.

స్నానం చేయండి. కలబంద చర్మాన్ని శుభ్రపరచడంతో పాటు మృదువుగా, మెరిసేలా చేస్తుంది.

క్రమం తప్పకుండా వాడటం వల్ల మొటిమలు, మచ్చలు మాయమవుతాయి.

స్నానం చేసే ముందు, నిమ్మరసాన్ని ముఖానికి రాసుకుని 10 నిమిషాలు అలాగే ఉంచండి.

ఒక చెంచా తేనెలో చిటికెడు దాల్చిన చెక్క పొడి కలిపి ముఖానికి రాసుకోవాలి. 15 నిమిషాల తర్వాత స్నానం చేయాలి.

శనగపిండి, రోజ్ వాటర్ కలిపి పేస్ట్ లా చేసి ముఖానికి అప్లై చేయాలి. 10-15 నిమిషాల తర్వాత స్నానం చేయండి. 

ఇలా చేయడం వల్ల ముఖం మీద మచ్చలు పోవడమే కాకుండా ముఖం కాంతివంతంగా మేరుస్తుంది