మద్యం ఆరోగ్యానికి హానికరం. మరి ఈ అలవాటు మానేశాక శరీరంలో వచ్చే మార్పులు ఏవంటే..

రోగ నిరోధక శక్తి మళ్లీ బలం పుంజుకుంటుంది. ఇన్ఫెక్షన్లను మరింత సమర్థంగా నిరోధిస్తుంది.

మద్యం మానేశాక చిరుతిళ్ల వైపు నుంచి దృష్టి మళ్లుతుంది. బరువు నియంత్రణలోకి వస్తుంది. 

మద్యపానం కారణంగా దెబ్బతిన్న జీవ గడియారం మళ్లీ కోలుకుని రాత్రిళ్లు కంటి నిండా నిద్ర పడుతుంది. 

ఆందోళన, కంగారు వంటివి తొలగిపోయి ఆలోచనల్లో స్పష్టత, ప్రశాంతత వస్తుంది. 

లివర్ కూడా క్రమంగా కోలుకుంటుంది. ఇన్‌ఫ్లమేషన్, అధిక కొవ్వులు తగ్గిపోతాయి స్వస్థత కలుగుతుంది.

బీపీ తగ్గి గుండె ఆరోగ్యం మెరుగవుతుంది. చర్మం కూడా యవ్వనకళను సంతరించుకుంటుంది. 

హార్మోన్‌ల సమతౌల్యం చేకూరడంతో శారీరక, మానసిక ఆరోగ్యం రెండూ ఇనుమడిస్తాయి