ఒత్తిడి వల్ల కార్టిసాల్ హార్మోన్ విడుదల బాగా జరిగి ఎన్నో అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి.
కార్టిసాల్ విడుదల ఒత్తిడిని మరింత పెంచుతుంది. జంక్ ఫుడ్ కార్టిసాల్ ఉత్పత్తిని ప్రేరేపిస్తుంది.
డార్క్ చాక్లెట్‌లో యాంటీ-ఆక్సిడెంట్లు, ఫ్లేవనాయిడ్స్ అధికంగా ఉంటాయి. ఇవి కార్టిసాల్ ఉత్పత్తిని నియంత్రణలో ఉంచుతాయి.
కార్టిసాల్ అధికంగా విడుదల కావడం వల్ల శరీరంలో ఆక్సిడేటివ్ స్ట్రెస్ పెరుగుతుంది. బెర్రీ పళ్లలోని యాంటీ ఆక్సిడెంట్లు ఆ ఆక్సిడేటివ్ స్ట్రెస్‌ను నియంత్రిస్తాయి.
సాల్మన్, మకేరల్ చేపల్లోని ఒమేగా ఫ్యాటీ ఆమ్లాలు కూడా కార్టిసాల్ విడుదలను బ్యాలెన్స్ చేస్తాయి.
పొటాషియంను అధికంగా కలిగి ఉండే అరటి పళ్లు అడ్రినలిన్ గ్రంథుల పనితీరును క్రమబద్ధీకరిస్తాయి. కార్టిసాల్ ఉత్పత్తిని కంట్రోల్ చేసి ఒత్తిడిని తగ్గిస్తాయి.
బాదం, ఇతర వాల్ నట్స్‌లో విటమిన్లు, ప్రోటీన్లు, పోషకాలు అధిక స్థాయిలో ఉంటాయి. ఇవి కార్టిసాల్ ఉత్పత్తి సమతూకంగా ఉండేలా చూస్తాయి.
నిమ్మ, బత్తాయి వంటి సిట్రస్ ఫలాల్లో ఉండే సీ విటమిన్ కూడా కార్టిసాల్ ఎఫెక్ట్‌ను తగ్గిస్తుంది. ఇమ్యూన్ సిస్టమ్‌ను బలోపేతం చేస్తుంది.
గ్రీన్ టీలో ఉండే L-థియానిన్ అనే అమినో యాసిడ్ శరీరాన్ని, మనస్సును ప్రశాంతంగా మారుస్తుంది.