మానసిక ఆరోగ్యం దెబ్బతింటున్న సందర్భాల్లో కనిపించే మార్పులు ఏవంటే..

నిద్ర పట్టకపోవడం లేదా అతిగా నిద్రపోవడం 

గతంలో ఇష్టంతో చేసిన పనులే నిరాసక్తంగా మారడం

కుటుంబం, స్నేహితులకు దూరంగా ఒంటరిగా ఉండేందుకు ప్రయత్నించడం

అకస్మాత్తుగా కోపం, బాధ, నిరాశ వంటి భావాలు మనసులో ఉప్పొంగడం

పూర్తి స్థాయిలో విశ్రాంతి తీసుకున్నా అలసటగా ఉండడం

ఆకలి మందగించడం లేదా అతిగా తినడం

భవిష్యత్తుపై బెంగతో నిరాశ నిస్పృహలకు లోను కావడం