గోండ్ కటిర గురించి తెలుసా?  ఎంత ఆరోగ్యకరమంటే.. 

గోండ్ కటిర లేదా గోధుమ బంకలో క్యాలరీలు, కార్బోహైడ్రేట్లు, ఫైబర్, సోడియం వంటి ఎన్నో పోషకాలు పుష్కలంగా ఉన్నాయి.

గోండ్ కటిర తెల్లని స్పటిక రూపంలో ఉంటుంది. దీనిని నిద్రపోయే ముందు వేడి పాలలో వేసుకొని తాగొచ్చు లేదా రాత్రంతా నీళ్లలో నానబెట్టి ఉదయాన్నే తీసుకోవచ్చు.

గోండ్ కటిర పేగుల ఆరోగ్యానికి, మలబద్ధకం నివారించడానికి ఉపయోగపడుతుంది. అలాగే డయాబెటిస్ చికిత్సకు, ఎముకల దృఢత్వానికి కూడా మద్దతుగా నిలుస్తుంది. 

వేసవి కాలంలో వడగాలుల నుంచి గోండ్ కటిర రక్షణ కల్పించగలదు. సహజసిద్ధమైన చలువ పదార్థంగా పని చేస్తుంది.

గర్భిణులకు గోండ్ కటిర దివ్యౌషధం లాంటిది. పాలిచ్చే తల్లుల్లో పాల ఉత్పత్తిని పెంచుతుంది. అలాగే కాల్షియం, ప్రోటీన్స్‌ను అందిస్తుంది. 

గోండ్ కటిరకు యాంటీ ఏజింగ్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి. చర్మానికి మంచి మెరుపునిస్తాయి. 

గోధుమలో కాల్షియం, ప్రోటీన్లు ఎక్కువగా ఉండడం వల్ల జుట్టు రాలే సమస్య తగ్గుతుంది. జుట్టు సంరక్షణకు ఉపయోగపడుతుంది. 

గోండ్ కటిర అధిక బరువుని నియంత్రించడమే కాకుండా శరీరం నుంచి టాక్సిన్లలను తొలగించి, మూత్రనాల శుద్ధికి కూడా సహాయపడుతుంది. 

గోండ్ కటిర రోగ నిరోధకతను కూడా పెంపొందిస్తుంది. ఇన్ఫెక్షన్లను కలిగించే వైరస్, బ్యాక్టీరియాలతో శరీరం పోరాడేందుకు శక్తినిస్తుంది.