ఇయర్ ఫోన్స్ వాడుతున్నారా..  ఈజాగ్రత్తలు పాటించండి..

ఇయర్ ఫోన్ లను ఎక్కువగా ఉపయోగిస్తే చెవులు తీవ్రంగా ప్రభావితమవుతాయి.

వీటిని అధికంగా ఉపయోగిస్తే ఇన్ఫెక్షన్లకు దారి తీస్తుంది. చెవిలో నొప్పికి కారణమవుతుంది. 

ఇయర్ ఫోన్‌లను ఎక్కువగా ఉపయోగించడం వల్ల ఏకాగ్రత లోపిస్తోంది. 

ఇయర్‌ ఫోన్స్‌ బదులుగా హెడ్‌ ఫోన్లు ఉపయోగించడం వల్ల పెద్దగా ఇబ్బందులు ఉండబోవంటున్నారు

 చెవి మీద హెడ్‌ఫోన్లు పెట్టుకోవడం వల్ల సౌండ్‌కు కర్ణభేరి మధ్య గ్యాప్‌ ఉంటుంది. దీంతో చెవిపై పెద్దగా ప్రభావం ఉండదని చెబుతున్నారు.

ఇయర్‌ ఫోన్స్‌తో ఉపయోగించేటప్పుడు సౌండ్ తక్కువగా పెట్టుకోవాలి

ఇయర్ ఫోన్స్ ను ఎక్కువుగా వాడేవారు పైన జాగ్రత్తలను తీసుకోవడం మంచిదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.