ఇటీవల సోషల్ మీడియాలో 80s, 90s నాటి వింటేజ్ లుక్ ట్రెండ్‌గా మారింది.

AI యాప్స్‌తో ప్రస్తుత ఫొటోలను 80s, 90s నాటి వింటేజ్ లుక్‌లోకి మార్చుకుంటూ మురిసిపోతున్నారు.

అయితే.. వినోదం కోసం చేస్తున్న ఈ పని మిమ్మల్ని ప్రమాదంలోకి నెట్టే అవకాశం ఉందని తెలుసా.

ఈ ట్రెండ్ వెనుక ఉన్న అసలు నిజాలు, ప్రమాదాలు ఇవే..

మీ ఫొటోలు ఆ యాప్స్ సర్వర్లలో సురక్షితంగా ఉంటాయనే గ్యారెంటీ లేదు.

AIతో మీ ముఖాన్ని డీప్‌ఫేక్ ఫొటోలు, వీడియోల్లో దుర్వినియోగం చేసే ప్రమాదం ఉంటుంది.

భవిష్యత్తులో మీ ఫోన్ లేదా బ్యాంక్ అకౌంట్లను అన్‌లాక్ చేయడానికి ఈ డేటాను హ్యాకర్లు ఉపయోగించే ఛాన్స్ ఉంది.

ఫోటోలను మార్ఫింగ్ చేసి సైబర్ నేరగాళ్లు బ్లాక్‌మెయిల్ చేసే ప్రమాదం ఉంది.

ఏదైనా యాప్ వాడే ముందు, ఫొటోల వినియోగ నిబంధనలు తప్పక పరిశీలించండి.

 వాట్సాప్ లేదా ఇన్‌స్టాగ్రామ్‌లో 90s లుక్ పేరుతో వచ్చే థర్డ్‌పార్టీ లింకులపై క్లిక్ చేయకండి.

కేవలం ట్రెండ్ కోసం మీ వ్యక్తిగత భద్రతను ఫణంగా పెట్టకండి.