మీ వయసును బట్టి..  మీరు ఎంత సేపు నిద్రపోవాలి? 

ఆహారం, నీళ్లు, గాలి లాగానే నిద్ర కూడా శరీరానికి ఎంతో అవసరం. తగినంత నిద్ర లేకపోతే ఎన్నో అనారోగ్యాలు చుట్టుముడతాయి. 

నిద్రలోనే శరీరం తనను తాను రిపేర్ చేసుకుంటుంది. ఆరోగ్యానికి ఉపకరించే ఎన్నో హార్మోన్లు నిద్రలోనే విడుదలవుతాయి. 

శరీరానికి నిద్ర ఛార్జింగ్ లాంటిది. వయసును బట్టి రోజులో నిద్రకు కేటాయించాల్సిన సమయాలు మారుతుంటాయి. 

నవజాత శిశువులు, 3 నెలలలోపు పిల్లలు రోజులో 14-17 గంటలు నిద్రపోవాలి. 1-2 సంవత్సరాల పిల్లలు 11-14 గంటలు నిద్రకు కేటాయించాలి. 

మూడు సంవత్సరాలు దాటిన పిల్లలు రోజులో 13 గంటలకు పైనే నిద్రపోవాలి. 6-16 సంవత్సరాల మధ్య వయసు గల పిల్లలు రోజులో 10 గంటలు నిద్రపోవాలి. 

18-25 సంవత్సరాల మధ్య వయసు గల వారు రోజులో 8-9 గంటలు నిద్రపోవాలి. 

25 సంవత్సరాలు పైబడిన వారు రోజుకు 8 గంటలు నిద్రకు కేటాయించాలి. 

65 సంవత్సరాలకు పైబడిన వృద్ధులు కనీసం 7 గంటలు నిద్రపోవాలి.