ముఖంపై ముడతలా? ఈ మ్యాజిక్ ఫుడ్స్‌తో ఇట్టే మాయం..!

వయసు పెరిగే కొద్దీ శరీరంలో కొల్లాజెన్ తగ్గి చర్మం వదులుగా మారి ముడతలు పడుతుంది. ముఖం లేదా చేతులపై సన్నని గీతలు కనిపిస్తాయి.

మీరు నాన్-వెజ్ తింటుంటే కచ్చితంగా చేపలు తినడం ప్రారంభించండి. సాల్మన్ చేపలు శరీరంలో కొల్లాజెన్‌ను పెంచుతాయి.

వాల్‌నట్స్, చియా గింజలు, బాదం, అవిసె గింజలు కూడా ముడతలను తగ్గించడంలో సహాయపడతాయి.

చిలగడదుంపలో కొల్లాజెన్, ఇతర పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఉడకబెట్టి లేదా చాట్ చేసుకుని తినవచ్చు. 

కొబ్బరి నీళ్లలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. వారానికి 2-3 సార్లు కొబ్బరి నీళ్లు తాగండి.

గుడ్లలో ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి. చర్మంపై ముడతలను తగ్గిస్తాయి.

ఆహారంలో సిట్రస్ పండ్లు, ఆకుపచ్చని కూరగాయలను చేర్చుకుంటే గ్లోయింగ్ స్కిన్ మీ సొంతం.